రణబాలి-జైలర్ ఏది నిలుస్తుంది?రెండూ నిలుస్తాయా?

October 14, 2026


img

రజనీకాంత్ నటించిన ‘జైలర్’ రేపు (అక్టోబర్‌ 15)న విడుదల కాబోతోంది. విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ‘రణబాలి’ (అక్టోబర్ 16)న విడుదల కాబోతోంది. రెండూ పెద్ద సినిమాలే.. భారీ అంచనాలతో వస్తున్నావే. కనుక రెంటి మధ్య పోటీలో ఏది నిలబడుతుంది? లేక రెండూ నిలబడుతాయా? అని సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్నారు. 

ఇదివరకు విడుదలైన ‘జైలర్’ మొదటి భాగం సూపర్ హిట్ అయ్యింది. దానికి కొనసాగింపుగా అదే టీమ్‌తో జైలర్-2 తీశారు. కనుక మొదటి భాగం కంటే ఇంకా గొప్పగానే ఉంటుంది తప్ప ఏమాత్రం తగ్గదని ట్రైలర్‌తో స్పష్టం చేశారు. 

ఇక విజయ్‌, రష్మికల పెళ్ళి తర్వాత కలిసి చేస్తున్న మొదటి సినిమా ‘రణబాలి.’ దీనిలో కూడా వారిద్దరూ భార్యాభర్తలుగానే నటించారు. కనుక ఈ సినిమాలో వారి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వచ్చింది. ఇక దీనిలో విజయ్‌ దేవరకొండ తన నట విశ్వరూపం చూపారు. పైగా స్వాతంత్ర్య సమర సమయంలో తిరుగుబాటు చేసిన ఓ వీరుడి కథ ఇది. కనుక దీనిపై పూర్తి నమ్మకంతో పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో విడుదల చేస్తున్నారు. 

కనుక రెండు సినిమాలు ఒకదానికొకటి గట్టి పోటీనిస్తాయని చెప్పవచ్చు. అయితే తెలుగు ప్రేక్షకులు ఈ రెంటిలో దేనికి మొగ్గు చూపుతారు? అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం లభిస్తుంది. 

ఈ రెండు సినిమాలతో తరుణ్ భాస్కర్‌ భాస్కర్, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన క్రేజీ కల్యాణం (అక్టోబర్‌ 16)న, ఆంధ్రాలో ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవిత కథతో అదే పేరుతో  తెరకెక్కించిన గరివిడి లక్ష్మి (అక్టోబర్‌ 17)న పోటీ పడబోతున్నాయి. 



Related Post

సినిమా స‌మీక్ష