దసరా పండుగ నేపథ్యంలో సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించింది. డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క నేడు మీడియాతో మాట్లాడుతూ, “సింగరేణి నికర లాభాలలో 34 శాతం అంటే సుమారు రూ.1,53,913 కార్మికులకు బోనస్‌గా అందుతుంది.
అలాగే సింగరేణిలో చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కూడా రూ.5,500 చొప్పున పండుగ కానుకగా అందించబోతున్నాము. ఈ బోనస్ సొమ్మును పండుగకు ముందే కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాము,” అని చెప్పారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మరో కీలక ప్రకటన కూడా చేశారు. “అనారోగ్య కారణాలతో పదవీ విరమణ చేయాలనుకుంటున్న కార్మికులు వైద్య పరీక్షలు, మెడికల్ సర్టిఫికేట్ కోసం కొత్తగూడెం వెళ్ళాల్సిన అవసరం లేకుండా వారు పనిచేస్తున్న ఏరియా ఆసుపత్రులలోనే ఆ సౌకర్యం కల్పిస్తాం. వారి డిపెండెంట్ ఉద్యోగాలకు అందిన దరఖాస్తులను కూడా ఈ నెలాఖరులోగా క్లియర్ చేస్తాం,” అని డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క చెప్పారు.
<blockquote class="twitter-tweet"><p lang="te" dir="ltr">దసరా సందర్భంగా సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు 34% లాభాల బోనస్ కింద ఒక్కొక్కరికి ₹1,53,912, కాంట్రాక్ట్ కార్మికులకు ఒక్కొక్కరికి ₹5,500 బోనస్ అందించాలని నిర్ణయించాం. కార్మికుల సొంతింటి కలను సాకారం చేసేందుకు ‘నెహ్రూ కాలనీల’ పేరుతో క్వార్టర్ల నిర్మాణం, ఏరియా ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయికి మించి ఆధునీకరించి అత్యుత్తమ వైద్య సదుపాయాల కల్పనకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. సింగరేణి కార్మికుల సంక్షేమమే మా ప్రభుత్వ ప్రాధాన్యత. On the occasion of Dasara, it has been decided to provide a 34% profit bonus of ₹1,53,912 to each Singareni worker and employee, along with a bonus of ₹5,500 to each contract worker. We are also working towards fulfilling the dream of homeownership for Singareni workers through the construction of residential quarters under the Nehru Colonies initiative. Plans are being prepared to modernise Singareni area hospitals beyond corporate standards and provide the best possible healthcare facilities to workers and their families. The welfare of Singareni workers remains a top priority for our government. #Singareni #SingareniWorkers #DasaraBonus #NehruColonies #Bhattivikramarka</p>— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) <a href="https://x.com/Bhatti_Mallu/status/2109921778877235264?ref_src=twsrc%5Etfw">October 13, 2026</a></blockquote> <script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>