యువనటుడు బెల్లంకొండ శ్రీనివాస్, సంయుక్త జంటగా నటిస్తున్న ‘హైందవ’ టీజర్ బుధవారం విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ‘కోపానికి ఒక కొత్త రూపం వచ్చింది. రక్త దాహం పెరుగుతోంది...’ అంటూ టీజర్ అప్‌డేట్ ఇచ్చారు.
లుదీర్ బైరెడ్డి దర్శకత్వంలో తీస్తున్న ఈ సోషియో ఫాంటసీ సినిమాలో జేడీ చక్రవర్తి, మహేష్ మంజేకర్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: లుదీర్ బైరెడ్డి, సంగీతం: లియాన్ జేమ్స్, కెమెరా: శివేంద్ర, ఆర్ట్: శ్రీనాగేంద్ర, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ చేస్తున్నారు.
మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు దీనిని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.