యువ కథానాయకుడు ఆది సాయికుమార్ కొత్త సినిమా ‘ఈగో రాజా.’ తమిళ దర్శకుడు గురు శరవణన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. ఆదితో పాటు తమిళ నటుడు సతీష్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
‘ఇగో రాజా’ పేరులోనే సినిమా కథ ఏవిధంగా సాగబోతోందో అర్ధమవుతుంది. వ్యక్తుల అలవాట్లు, బలహీనతలు, ,మ్యానరిజం వంటివాటితో కథ అల్లుకొని వచ్చిన సినిమాలలో అతికొద్ది సినిమాలు ప్రేక్షకులను మెప్పించగలిగాయి. కనుక మన రాజా తన ఇగోతో ప్రేక్షకులను మెప్పించగలరో లేదో సినిమా విడుదలైతే తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. త్వరలో వివరాలు వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది.
ఎస్‌జీఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి.సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: గిబ్రాన్, కెమెరా: మనోజ్ పరమహంస చేస్తున్నారు.