సర్ పేరుతో లక్షలాది ఓట్లు తొలగించడానికి కేంద్ర ఎన్నికల కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ బాధ్యత వహించాలంటూ సీజేపీ, ఇండియా కోటమి చేస్తున్న ఆందోళనలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.
“దేశంలో అన్ని వ్యవస్థలు, వాటిలో పనిచేసే అందరూ రాజ్యాంగానికి కట్టుబడి దాని పరిధిలోనే పనిచేయాలి. ఎవరికీ ఇతరుల ఓటు హక్కు లాక్కునే అధికారం లేదు. ఈ రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీస్తున్న జ్ఞానేశ్ కుమార్ తక్షణం తన పదవికి రాజీనామా చేసి తప్పుకోవాలి.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎందరో వచ్చారు పోతుంటారు. ఈ దేశం అలాంటి ఎంతోమంది వ్యక్తులను చూసింది. అయినా వారి అరాచకాలు తట్టుకొని నిలబడింది. ఇంత బలమైన వ్యవస్థలతో కూడిన మన దేశాన్ని ఎవరో ఒక వ్యక్తి శాశించాలనుకుంటే చూస్తూ ఊరుకోలేము కదా?
అయన చేత రాజీనామా చేయించాల్సినవారే ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తుండటం ఇంకా బాధాకరం. దేశంలో 140 కోట్ల భారతీయుల కంటే ఆ ఒక్క వ్యక్తి ప్రభుత్వానికి ముఖ్యం అయిపోయారా? ఎందుకు?
సర్ పేరుతో జరిగిన ఈ అక్రమాలను సరిచేసి భారతీయుల ప్రాధమిక హక్కులను కాపాడాలని ఈ సందర్భంగా నేను సుప్రీంకోర్టును కోరుతున్నాను. తక్షణమే సిట్టింగ్ జడ్జ్ చేత ఈ వ్యవహారంపై విచారణ జరిపించి నిజానిజాలు నిగ్గు తేల్చాలని,” కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.