చుట్టమల్లె ఫేక్ వీడియో గురించి మరో ఫేక్ వీడియో!

October 08, 2026
img

జూ. ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌జంటగా నటించిన ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లె’ వీడియో సాంగ్‌ను ఏఐతో మార్ఫింగ్ చేసి జాన్వీ కపూర్‌ను అశ్లీలంగా చూపుతూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఓ వీడియో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. దీనిని ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌లతో సహా పలువురు సెలబ్రిటీలు తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్‌ సైబర్ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

వారు వైసీపీకి చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వచ్చింది. దీంతో ఈ వార్త కూడా వైరల్ అయ్యింది. ఆ వ్యక్తి ఎవరు? ఎక్కడ ఉంటాడు? వైసీపీలో అతను ఏ పదవిలో ఉన్నాడనే చర్చ మొదలైంది. 

దీనిపై హైదరాబాద్‌ సీపీ విసి సజ్జనార్‌ వెంటనే స్పందిస్తూ, ఇది కూడా ఏఐతో సృష్టించిన నకిలీ ఫోటోయేనని స్పష్టం చేశారు. కనుక వాస్తవాలు ధృవీకరించుకోకుండా ఇటువంటి ఫోటోలు, వీడియోలు, వార్తలను ప్రచారం చేయవద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు.    

అలాగే జూ.ఎన్టీఆర్‌కు కూడా విసి సజ్జనార్‌ ఓ విజ్ఞప్తి చేశారు. మీ అభిమానులలో కొందరు ఈ వార్తలో నా ఫోటోను కూడా మార్ఫింగ్ చేసి ఉపయోగించుకున్నారని తెలియజేశారు.          

Related Post