తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు మొదలవుతాయి. విదేశాలలో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు కూడా అట్టహాసంగా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారు. కల్వకుంట్ల కవిత ఇది వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆమె వెళ్ళి వాటిలో పాల్గొనేవారు.
కానీ ఇప్పుడు ఆమె టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారు. కనుక బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు దుబాయ్‌లో జరిగే ఈ వేడుకలో పాల్గొనేందుకు బయలుదేరబోతున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది.
ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అధ్వర్యంలో జరుగబోయే ఈ వేడుకలలో పాల్గొనాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆహ్వానించారు. కానీ అయన రాష్ట్ర రాజకీయాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. కనుక అయన ఆదేశం మేరకు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు దుబాయ్ బయలుదేరి వెళుతున్నారు
దుబాయ్‌లో బతుకమ్మ వేడుకలకు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం @KTRBRS గారి ఆదేశాల మేరకు ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో దుబాయ్‌లో ఘనంగా నిర్వహించనున్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో దుబాయ్‌లో ఘనంగా నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. దుబాయిలో బతుకమ్మ వేడుకలకు హాజరు కావాలని ETCA ప్రతినిధులు గత నెలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ని కలిసి ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు దుబాయి వెళ్లి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనాలని కేటిఆర్ సూచించారు. అక్టోబర్ 11, ఆదివారం దుబాయ్‌లోని శబాబ్ అల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరగనున్న ఈ బతుకమ్మ వేడుకల్లో బిఆర్ఎస్ ప్రతినిధుల బృందం పాల్గొననుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మను విదేశీ గడ్డపై, ఎడారి దేశంలో వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే, బాల్కొండ, కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్యే, కోరుట్ల బాజిరెడ్డి గోవర్ధన్ మాజీ ఎమ్మెల్యే, నిజామాబాద్ రూరల్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఆర్మూర్, బిగాల గణేష్ గుప్తా, మాజీ ఎమ్మెల్యే, నిజామాబాద్ అర్బన్, సురేందర్, మాజీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి, షకీల్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే, బోధన్ హాజరుకానున్నారు. @VPR_BRS @drsanjayBRS @JeevanReddyBRS @GaneshBigalaMLA @GovardhanBRS
— BRS News (@BRSParty_News) October 7, 2026