ఓంకారేశ్వరాలయాభివృద్ధికి రూ.1,108 కోట్లు మంజూరు

October 07, 2026


img

మూసీ నది ఒడ్డున మంచిరేవుల వద్ద గల అతి పురాతనమైన ఓంకారేశ్వర స్వామి ఆలయానికి ఇప్పుడు మహర్దశ పట్టబోతోంది. ఈ ఆలయాభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,108 కోట్లు మంజూరు చేసింది. దీనిలో ఆలయానికి రూ.949 కోట్లు కేటాయించగా, అక్కడికి వెళ్లేందుకు ఇస్తానా విల్లాస్‌ నుంచి కీర్తి వెస్ట్‌విండ్‌ విల్లాస్‌ వరకు 2.5 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.160 కోట్లు కేటాయించింది. 

తెలంగాణ ప్రభుత్వం మూసీ రివర్‌ఫ్రంట్‌ ప్రాజెక్టు చేపట్టడం వలన దానిలో భాగంగా ఓంకారేశ్వర స్వామి ఆలయ సముదాయాన్ని కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించి నిధులు విడుదల చేయడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఆలయ అభివృద్ధికి కేటాయించిన నిధులతో ప్రాంగణంలో రాజగోపురం, యాగశాల, పుష్కరిణి తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు. 

ఇప్పుడు నిధులు విడుదల చేసి పరిపాలనా అనుమతులు కూడా మంజూరు చేయడంతో త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభం కాబోతున్నాయి.


Related Post