శ్రీకర్ నయన్ జి. దర్శకత్వంలో మాస్టర్ రోహాన్ రాయ్, మాస్టర్ అరుణ్ ప్రధాన పాత్రలు చేస్తున్న ‘సమ్మర్ హాలీడేస్,’నుంచి ‘ఫ్రెండ్‌షిప్ సాంగ్’ విడుదలైంది. ఈ పాటకు పల్లవి పూర్ణాచారి అందించగా, చరణం, హుక్‌లైన్‌ను కిట్టు విస్సప్రగడ వ్రాశారు. సింజిత్ యెర్రమిల్లి స్వరపరిచి సంగీతం అందించగా శ్రీరామచంద్ర చక్కగా ఆలపించారు.
ప్రతి మనిషి జీవితంలో బాల్యం, ముఖ్యంగా ‘సమ్మర్ హాలీడేస్’ మధురానుభూతులు తప్పక ఉంటాయి. దర్శకుడు శ్రీకర్ తన బాల్యంలోని అనుభూతులను ఈ సమ్మర్ హాలీడేస్ కధగా వ్రాసుకొని ఈ సినిమా సిద్ధం చేస్తున్నారు.
ఈ సినిమాలో మాస్టర్ రోహాన్ రాయ్, మాస్టర్ అరుణ్ బాల్య స్నేహితులుగా నటించగా, జయసుధ, వాసుకి ఆనంద్, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, రమణ భార్గవ్, హర్షిణి కొడూరి, మహేశ్ చింతల తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకర్ నయన్ జి, సంగీతం: సింజిత్ యెర్రమిల్లి, సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాశ్ ఉమ్మడిసింగు, ఎడిటింగ్: సంతోష్ నాయుడు చేస్తున్నారు.
ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్, వీజీబీ ఫిల్మ్స్ బ్యానర్లపై ధీరజ్ మొగిలినేని, గిరి బాబు వల్లభనేని కలిసి నిర్మిస్తున్న ఈ సమ్మర్ హాలీడేస్ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.