నేరెళ్ల బాధితులకు న్యాయం చేస్తామన్నారుగా.. ఏమైంది? కవిత

October 04, 2026

img

నేరెళ్ల బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని టిఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నేరుగా కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు.

మొన్న సిరిసిల్ల పర్యటనలో బాధితులకు న్యాయం చేస్తూ ఏదైనా ప్రకటన చేస్తారనుకుంటే, రాజకీయ అంశాలు మాట్లాడి వచ్చేశారు. నేరెళ్ళ బాధితులు అనుభవించిన మానసిక క్షోభ, ఎదుర్కొన్న సమస్యలు, అనుభవిస్తున్న కష్టాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.5-10 లక్షల నష్ట పరిహారం ఏమాత్రం సరిపోదు.

నేరెళ్ల ఘటనలో బాధితులుగా ఉన్న 8 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల భూమి, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

నేరెళ్ల బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. ఇప్పుడు ఆ హామీలను అమలు చేయడం లేదని కవిత విమర్శించారు.

ఘటనకు కారణమైన వారిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. పైగా ఈ కేసుకు  సంబంధించిన ఫైళ్లు కనిపించడం లేదని సంబంధిత అధికారులు చెప్తే అందుకు వారిపై చర్యలు తీసుకోకుండా, ప్రభుత్వం కూడా అదే చెప్పడం బాధ్యతారాహిత్యమని కవిత మండిపడ్డారు.

నేరెళ్ల ఘటనకు సంబంధించి మీడియా కథనాలతో పాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ వద్ద కూడా అనేక ఆధారాలు, రికార్డులు ఉన్నాయని, వాటి ఆధారంగా మళ్ళీ కేసు విచారణ జరిపించి దోషులను కటినంగా శిక్షించి బాధితులకు న్యాయం చేయొచ్చని ఆమె సూచించారు. ముఖ్యంగా నేటికీ నేరెళ్ల బాధితులపై కేసులు అలాగే ఉన్నాయని, వాటిని తక్షణం రద్దు చేయాలని ఆమె సిఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.

ఒకవేళ ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయిస్తామని కవిత హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై మరోసారి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

నేరెళ్ల బాధితులు అసలు బాధితులు అని చెప్పే ఆధారాలే లేవట? ఈ మాట చెప్పడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి

నేరెళ్ల బాధితులను ఉపయోగించుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ వారికి ఇచ్చిన హామీలు మర్చిపోయిందా?

ఆగమైన వారి జీవితాలకు మొక్కుబడి సాయంతో సరిపెడతారా

బాధిత… pic.twitter.com/JlB0noRmpr
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 4, 2026

Related Post