మైసా ట్రైలర్‌.. నేషనల్ క్రష్ రష్మికేనా?

October 04, 2026


img

రష్మిక మందన ప్రధాన పాత్ర చేస్తున్న ‘మైసా’ ట్రైలర్‌ విడుదలైంది. ఎక్కడో మారుమూల గిరిజన గ్రామాలలో నివసించే ప్రజలు కూడా అణచివేతకు గురవుతుండటం, అప్పుడు వారిలో నుంచి ఒకరు ముందుకు వచ్చి నాయకత్వం వహించి పోరాటాలు చేయడం చాలా సినిమాలలో చూశాము. ‘మైసా’ కథ కూడా అటువంటిదేనని ట్రైలర్‌ చూస్తే అర్ధమైంది.

అయితే ఇలాంటి కథలతో హీరో లేదా హీరోయిన్‌ సినిమా చేస్తున్నప్పుడు ప్రేక్షకులను మెప్పించాల్సిన పూర్తి బాధ్యత వారిపైనే పడుతుంది. అందుకు వారు ఎలాగూ గట్టిగా ప్రయత్నిస్తారు. కానీ కథ, కధనం, సంగీతం వగైరా అన్నీ కూడా చక్కగా కుదరాలి. మరి మైసాలో కుదిరాయో లేదో నవంబర్‌ 27న విడుదలైనప్పుడు తెలుస్తుంది.        

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: రవీంద్ర పుల్లె, సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా:శ్రేయాస్ కృష్ణ, స్టంట్స్: అండీ లాంగ్ చేస్తున్నారు.  

అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోపా కలిసి మైసాని పాన్‌ ఇండియా మూవీగా 5 భాషల్లో తెరకెక్కిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష