భారత్ అంతరిక్ష సంస్థ ఇస్రో ‘చంద్రయాన్’1,2,3 అంటూ ప్రయోగాలు చేస్తుండగానే నిర్మాతగా మారిన దర్శకుడు వేణు ఊడుగుల కూడా ‘చంద్రయాన్’ అంటూ ఇస్రోతో పోటీకి సిద్దమైపోయారు.
‘నీది నాదీ ఒకే కథ’, ‘విరాట పర్వం’ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు ఊడుగుల, ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాతో నిర్మాతగా మారి తొలి దశ సినిమాతోనే విజయం అందుకున్నారు.
ఇప్పుడు ఆయన సమర్పణలో ‘చంద్రయాన్’ అనే గ్రామీణ కామెడీ సినిమా తెరకెక్కుతోంది. బాధ్యత లేకుండా అల్లరి చిల్లరిగా తిరిగే ముగ్గురు పల్లెటూరి ముగ్గురు యువకులు, తమ సత్తా నిరూపించుకోవాలనుకుంటారు. అందుకు రాకెట్ తయారు చేసి చంద్రుడిపైకి వెళ్ళాలనుకుంటారు. అదే ఈ చంద్రయాన్.. దానికి ఇచ్చిన ఫస్ట్ సిగ్నల్లోనే ఓ కోడి చచ్చింది.
శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం చేస్తున్న ఈ సినిమాలో శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
చంద్రయాన్ కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: శ్రీనాథ్ చంద్రశేఖర్, సినిమాకు సంగీతం: హర్ష ప్రవీణ్, సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ బి, ఎడిటింగ్: పి.ఆర్. తేజ దాసరి,
వేణు ఊడుగుల సమర్పణలో సింబా స్క్రీన్ స్టోరీస్ పతాకంపై ప్రవీణ్ మొలక నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 30న విడుదల కాబోతోంది.