ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్న ఫాంటసీ, అడ్వెంచర్ చిత్రం ‘మరకతమణి 2’ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియాలో ద్వారా ప్రకటిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ట్రైలర్‌తో పాటు సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
ఏఆర్‌కే శరవణన్ దర్శకత్వంలో 2017లో విడుదలైన ‘మరకతమణి’ చిత్రానికి ఇది సీక్వెల్.
ఈ సినిమాలో నిక్కీ గల్రాణి, ప్రియా భవానీ శంకర్, సత్యరాజ్, మునీష్‌కాంత్, ఆనంద్‌రాజ్, డేనియల్ అన్నీ పోప్, అరుణ్‌రాజా కామరాజ్ తదితరులు నటిస్తున్నారు.
తొలి భాగంలో కనిపించిన పలువురు నటులతో పాటు ఈ సీక్వెల్‌లో కొత్తగా సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్ కూడా చేరారు.
ఈ సినిమాకు సంగీతం: ధీబు నినన్ థామస్, సినిమాటోగ్రఫీ: దీపక్ డి. మీనన్, పి.వి. శంకర్, ఎడిటింగ్: తిరుమలై రాజన్ చేస్తున్నారు.
ప్యాషన్ స్టూడియోస్, ఆక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది..