అక్టోబర్ 9న హనుమాన్ అంశ్ తెలుగులో విడుదల

October 02, 2026


img

ఉత్తరాది రాష్ట్రాలలో ఘన విజయం సాధించిన సూపర్ హిట్ హిందీ సినిమా ‘హనుమాన్ అంశ్’ ఎట్టకేలకు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తొలుత సెప్టెంబర్ 18న తెలుగు వెర్షన్‌ను విడుదల చేయాలని భావించినప్పటికీ, అనివార్య కారణాల వలన వాయిదా పడింది. తాజాగా చిత్రబృందం అక్టోబర్ 9న తెలుగు వెర్షన్‌ విడుదల చేయబోన్నట్లు ప్రకటించింది. 

ఇది 1900-73 మద్య కాలంలో జీవించిన హనుమాన్ భక్తుడు, ప్రముఖ ఆద్యాత్మిక గురువు నీమ్‌ కరోలీ బాబా జీవిత గాథ ఆధారం తీసిన సినిమా. దీనిలో నీమ్‌ కరోలీ బాబాగా శోభిత్ శ్రీవాత్సవ నటించగా, చందన్ ఆనంద్, పూర్ణిమ తివారీ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. శోభినవ్ సత్యా, విహాన్ షెడ్గే, చందన్ కె. ఆనంద్, పూర్ణిమ తివారీ, అనిల్ రస్తోగి, గుల్షన్ పాండే తదితరులు ఇతర పాత్రలలో నటించారు.

ఉత్తరాది ప్రజలను భక్తిపారవశ్యంలో ముంచెత్తిన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: విశాల్ చతుర్వేది, సినిమాటోగ్రఫీ: విశాల్ బావా, ఎడిటింగ్: శంఖ్ రాజాధ్యక్ష, పాటలు: సాధు తివారీ, రిషి పాఠక్, శ్రేయస్ ధర్మాధికారి, శంతను సుదామే, సంగీతం: ధీరేంద్ర ముల్కల్వార్, సునీల్ లోధి, ధీరేంద్ర ముల్కల్వార్, విశాల్ చతుర్వేది చేశారు.  

స్వంభు మీడియా నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో, హోలీ కౌ హోమ్ ప్రొడక్షన్స్‌ బ్యానర్లపై రాగిణి ఎస్., నమ్రత జి. సింగ్, అనుప్రియా ఎ.నగర్, విశాల్ చతుర్వేది కలిసి నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. తెలుగులో ఈ నెల 9న విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష