అక్కినేని సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలు చేసిన ‘మహేంద్రగిరి వారాహి’ సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలైంది. కానీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. రేపు గాంధీ జయంతి సందర్భంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేస్తోంది.
సంతోష్ జాగర్లపూడి కధ దర్శకత్వంలో వచ్చినఈ సినిమాలో సుమంత్, ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్, మీనాక్షి గోస్వామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, అలీ, మాళవికా నాయర్, మంజు భార్గవి, రాజీవ్ కనకాల, వంశీ చాగంటి, కమల్ కామరాజు, శ్రీనివాస్ వడ్లమాని ముఖ్యపాత్రలు చేశారు.
రాజశ్యామల ఎంటర్‌టైన్మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై మధుకాలిపు, లక్ష్మణ్ కలిసి ఈ సినిమా నిర్మించారు.