నిన్న సిరిసిల్ల సభలో కేటీఆర్‌కు హైటెక్ సిటీ వద్ద మూడు ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయని సిఎం రేవంత్ రెడ్డి బయటపెట్టారు. ఇది నిజమా కాదా? చెప్పాలని ఆ సభలో నిలదీశారు.
కేరళ పర్యటన ముగించుకొని వచ్చిన కేటీఆర్ నేడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, “యస్! నాకు మూడు హోటల్స్ ఉన్నాయి. ఈ విషయం నేను 2009 ఎన్నికల అఫిడవిట్‌లోనే పేర్కొన్నాను. ఈ రేవంత్ రెడ్డి వాటిని కొలంబస్, వాస్కోడీగామాలా కొత్తగా కనిపెట్టిన్నట్లు చెపుతున్నారు.
నా పెళ్ళాం బిడ్డలకి బువ్వ పెట్టాలి కదా? అందుకు నేను వ్యాపారాలు చేసుకుంటున్నాను. అది తప్పా? ఏది ఏమైనప్పటికీ నా హోటల్స్‌కి ఉచిత పబ్లిసిటీ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డికి థాంక్స్,” అని కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో పది అంతస్తులలో 190 గదులు కలిగిన డెక్కన్ సెరాయ్ గ్రాండే, రహేజా మైండ్ స్పేస్ వద్ద వంద గదులు కలిగిన డెక్కన్ సెరాయ్, కొండాపూర్, వైట్‌హౌస్ ఫీల్డ్స్ వద్ద 120 గదులు కలిగిన ‘ఎట్ హోం సర్వీస్డ్ అపార్ట్‌మెంట్స్’ కేటీఆర్ కుటుంబ సభ్యులకు ఉన్నట్లు సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అవి నిజమేనని కేటీఆర్ కూడా ధ్రువీకరించారు.

నాకు హోటల్ ఉందని 2009లోనే అఫిడవిట్‌లో పెట్టాను

రేవంత్ రెడ్డి నాకు హోటల్ ఉంది అంటున్నాడు.. నేనే చెప్పినదాన్ని నువ్వు చెప్పేదేంది? కొలంబస్‌లాగా!

వాస్కోడిగామా కనుక్కున్నట్లు నువ్వు కొత్తగా కనుక్కున్నదేంది?

- కేటీఆర్ pic.twitter.com/UEyF6nZaeY
— Telugu Scribe (@TeluguScribe) October 1, 2026