షారూక్ ఖాన్ పేరు పెట్టుకుంటే షారూక్ అయిపోతానా? కేటీఆర్‌

September 30, 2026


img

కేరళలో జరుగుతున్న ఇండియా టుడే కాంక్లేవ్-2026కు హాజరైన రాజకీయ ప్రముఖులలో మాజీ మంత్రి బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కూడా ఒకరు. అందరిలాగే ఆయనపై కూడా మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో వెళ్ళేందుకు టీఆర్ఎస్‌ పేరు బీఆర్ఎస్‌ పార్టీగా మార్చుకోవడంపై అడిగిన ప్రశ్నకు కేటీఆర్‌ చెప్పిన మాధానం చాలా ఆసక్తికరంగా ఉంది. 

“నేను షారూక్ ఖాన్ అని పేరు మార్చుకున్నాంత మాత్రాన్న షారూక్ ఖాన్ అయిపోను కదా? అదేవిధంగా మా పార్టీ పేరే మార్చుకున్నాము. కానీ మా పార్టీ ఆశయాలు, ఆలోచనా విధానం, సిద్ధాంతాలు, నాయకత్వం, ప్రజల పట్ల అంకితభావం ఏవీ మారలేదు.

తెలంగాణలో మా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలు, చేసిన అభివృద్ధి పనులు దేశమంతటా విస్తరించాలని, దేశ ప్రజలందరికీ లబ్ది కలిగించాలనే ఆలోచనతోనే మేము ఆ ఆలోచన చేశాము. అయినా తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయికి ఎదిగినప్పుడు, తెలుగు నేలపై పుట్టిన మా పార్టీ జాతీయ స్థాయికి ఎందుకు వెళ్ళకూడదు? అని కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు.   


Related Post