సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘ధర్మన్’ సినిమాలో రామ్ పోతినేని నటిస్తున్నట్లు తెలియజేయాలనుకున్నారో ఏమో సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేశారు. కానీ వెంటనే డిలీట్ చేసేశారు. సోషల్ మీడియాలో ఒక్క సెకను సేపు ఏదైనా ఉంటే దానిని కోట్లమంది చూసి క్యాచ్ చేస్తుంటారు. కనుక రామ్ పోతినేని డిలీట్ చేసిన ఆ ఫోటోని కూడా క్యాచ్ చేసి మళ్ళీ షేర్ చేస్తున్నారు. ఆ ఫోటోలో రజనీకాంత్, రాశీ ఖన్నా, రామ్ పోతినేని ముగ్గురూ ఉన్నారు.
ధర్మన్ సినిమాలో నటిస్తున్న రజనీకాంత్, రాశీ ఖన్నాలతో రామ్ పోతినేని ఫోటో దిగారంటే ఆ సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించినట్లే. అయితే రామ్ పోతినేని ఈ విషయం ఎవరికీ తెలియకూడదనుకుంటే సోషల్ మీడియాలో ఆ ఫోటో పోస్ట్ చేసేవారే కారు. కనుక పెట్టి వెంటనే డిలీట్ చేయడం ద్వారా అందరూ దీని గురించి సోషల్ మీడియాలో వెతికేలా చేసి తనని తాను చక్కగా ప్రమోట్ చేసుకున్నట్లే భావించవచ్చు.
ఈ సినిమాలో అసాంఘిక శక్తులకు తగిన ట్రీట్‌మెంట్ ఇచ్చే వైద్యుడిగా రజనీకాంత్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. కనుక ధర్మన్ కూడా రజనీకాంత్ మార్క్ పంచ్ డైలాగులు, యాక్షన్ సీన్స్, డాన్సులు వగైరా తప్పక ఉంటాయనే భావించవచ్చు.
అశ్వత్థ ముత్తు దర్శకత్వంలో అయన సొంత బ్యానర్ అశ్వత్థ ముత్తు ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ కలిసి నిర్మిస్తున్న ‘ధర్మన్’లో సిమ్రాన్, రాశీఖన్నా ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మన్, ఎడిటింగ్: ప్రదీప్ ఈ రాఘవ్ చేస్తున్నారు.