రమేష్ బండ్రేడ్డి దర్శకత్వంలో హర్ష రోహాన్, నక్షత్ర జంటగా చేసిన ‘తెల్ల కాగితం’ అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ప్రేమంటే మందే అంటూ..’ మూడో పాట విడుదలైంది.
సురేష్ బన్సెట్టి వ్రాసిన ఈ పాటని విజయ్ బుల్గానిన్ స్వరపరిచి సంగీతం అందించగా కార్తీక్, సమీరా భరద్వాజ్ ఆలపించారు.
ఈ సినిమాలో దీపక్, అజయ్, రూపాలక్ష్మి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: నందు సవిరిగన, సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: కేవీ గుహన్, కొరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి, ఎడిటింగ్: ఆర్. కార్తీక శ్రీనివాస్ చేశారు.
కే. శ్రీదేవి సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కాబోతోంది.