ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్న ‘రామాయణ’ మొదటి భాగం ఈ దీపావళి పండుగనాడు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి రెండు కొత్త పోస్టర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. రెండూ బాగున్నాయి. వాటిలో రాజసంతో కనిపిస్తున్న రావణుగాడు యష్ పోస్టర్ మరింత బాగుంది.
ఈ సినిమా నుంచి వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన ‘జై జై రామ్..’ అంటూ సాగే పాటకు ప్రజల నుంచి, సోషల్ మీడియాలో కూడా మంచి స్పందన వచ్చింది.
రామాయణలో హనుమంతుడిగా బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్, లక్ష్మణుడుగా రవీ దుబే, అరుణ్ గోవిల్ దశరథుడిగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా, రావణుడుగా కన్నడ నటుడు యష్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు.
ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ గ్రహీతలు ఏఆర్ రహమాన్, హాన్స్ జిమ్మర్ కలిసి సంగీతం అందిస్తున్నారు. అలాగే 8 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న డీఎన్‌జీ విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు పనిచేస్తోంది.
ఈ ఏడాది దీపావళి (నవంబర్ 8)న రామాయణ మొదటి భాగం, వచ్చే ఏడాది దీపావళికి రెండో భాగం విడుదల కాబోతోంది.