గ్రామ పంచాయితీలకు సీతక్క శుభవార్త!

September 26, 2026


img

తెలంగాణ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క నేడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలలో జరుగుతున్న గ్రామ పంచాయితీ భవన నిర్మాణ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఓ శుభవార్త చెప్పారు. 

రాష్ట్రంలో సొంత భవనాలు లేని 5,118 గ్రామ పంచాయతీల కోసం రూ.1,000 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని పంచాయతీలకు సొంత భవనం కలిగి ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే సొంత భవనాలు లేని 3,269 పంచాయితీలకు భవనాలు నిర్మిస్తున్నామని, వాటి నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను కూడా ఈ ఏడాదిలోనే పూర్తి చేసి గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి సీతక్క చెప్పారు.

వీటితో పాటు మరో రూ.800 కోట్లు వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 8,000 గ్రామాలలో మహిళా సంఘాల భవన నిర్మాణ పనులు కూడా చేపట్టామని, వాటి నిర్మాణ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయని మంత్రి సీతక్క చెప్పారు.



Related Post