సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న‘సిగ్మా’ నుంచి సులోచన అంటూ సాగే ప్రత్యేక గీతం వచ్చేసింది. కృష్ణ చైతన్య వ్రాసిన ఈ పాటకు తమన్ సంగీతం అందించగా స్మృతి రహజానీ మత్తుమత్తుగా ఆలపించారు.
తమిళనాడు సిఎం జోసఫ్ విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడుగా పరిచయమవుతున్న ఈ సినిమాలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ పండిట్, అంబు థాసన్, యోగ్ జపి, మహాలక్ష్మి, షీలా రాజ్‌కుమార్, కమలేష్, కిరణ్ కొండ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకు పాటలు: వివేక్, సూపర్ సుబ్బు; సంగీతం: థమన్ ఎస్ ; ఎడిటర్: ప్రవీణ్ కేఎల్ ; కెమెరా: కృష్ణన్ వసంత్; వీఎఫ్‌ఎక్స్‌ప్రెస్: హరిహరసుతన్; యాక్షన్; వెంకట్ చేశారు.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెలుగు, తమిళ భాషలలో నిర్మించిన ‘సిగ్మా’ అక్టోబర్ 2న విడుదల కాబోతోంది.