రవి గోలి, తేజ కనకాల కథ, దర్శకత్వంలో వివాస్వాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా టైటిల్ మత్స్య. దీని టైటిల్ గ్లిమ్స్ కాస్త వెరైటీగానే ఉంది. ముఖ్యంగా హీరో ఓ బోటులో పడుకొని ఉండగా దాని కింద నుంచి అతిపెద్ద వేల్ చేప వెళుతున్న దృశ్యం చాలా అద్భుతంగా ఉంది.
సముద్ర మంటేనే అంతుపట్టని లోతులు.. రహస్యాలు. వాటి నేపధ్యంలో తెరకెక్కుతున్న ‘మత్స్య’లో మిస్టరీ, అడ్వెంచర్ రెండూ ఉంటాయి. అయితే కాస్త కామెడీ, రొమాన్స్ కూడా తప్పనిసరి. కనుక అన్నీ సమపాళ్ళలో కలిసి ‘మత్స్య’ని రూపొందిస్తున్నారు దర్శకులు రవి గోలి, తేజ కనకాల.
ఈ సినిమాకు సంగీతం: ఉజ్వల్ గుప్తా, సినిమాటోగ్రఫీ: సురేశ్ సారంగం, డైలాగ్స్: జయకృష్ణ, ఎడిటర్: పీఎస్ రెడ్డి, . వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్, కంపోజర్: సాయి శశాంక్ చేస్తున్నారు.
జీబీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సమిహిత జీ ఇంటూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.