మహేష్ గౌడ్‌పై హరీష్ పరువు నష్టం దావా!

September 24, 2026


img

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌ గౌడ్‌పై మాజీ మంత్రి బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌ రావు పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు. తాను తమిళనాడు వెళ్ళి క్షుద్రపూజలు చేయిస్తునానంటూ తనపై దుష్ప్రచారం చేసి తన పరువుకు భంగం కలిగించినందుకు పరువు నష్టం దావా వేస్తున్నానని హరీష్‌ రావు చెప్పారు.

ఈరోజే న్యాయస్థానంలో దావా సమర్పించగా దానిని స్వీకరించిందని హరీష్‌ రావు తెలిపారు. వచ్చే బుధవారం ఈ కేసు విచారణ చేపట్టే అవకాశం ఉందని చెప్పారు. 

అయితే మహేష్ కుమార్‌ గౌడ్‌పై ఎన్ని కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నారనే విషయం చెప్పలేదు. బహుశః న్యాయవాదుల సలహా మేరకు ఈ విషయం బయటపెట్టి ఉండకపోవచ్చు. అయితే సాధారణంగా మొదట న్యాయవాది ద్వారా సంబందిత వ్యక్తికి నోటీస్ పంపించి, క్షమాపణ లేదా జవాబు కోరడం ఆనవాయితీ. కానీ హరీష్‌ రావు నేరుగా కోర్టులో దావా వేశాక ఈవిషయం బయటపెట్టారు. 

దీనిపై మహేష్ కుమార్‌ గౌడ్‌ ఇంకా స్పందించాల్సి ఉంది. అయితే టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్‌ ఆరోగ్యం చెడిపోవాలని హరీష్‌ రావు తమిళనాడులో క్షుద్రపూజలు చేస్తున్నారంటూ పలుమార్లు ఆరోపించారు.

అంతేకాదు ఆమె హరీష్‌ రావుని పదేపదే గుంటనక్క అంటూ సంభోదిస్తుంటారు. కానీ హరీష్‌ రావు ఎన్నడూ స్పందించలేదు. ఆమెపై పరువు నష్టం దావా వేయలేదు. కానీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌ గౌడ్‌పై దావా వేశారు.


Related Post