కాస్త ఆలస్యంగా వస్తామంటున్న ఆదర్శ కుటుంబం..

September 23, 2026


img

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం విక్టరీ వెంకటేష్‌ హీరోగా  ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నం: 47’ అక్టోబర్ 2న విడుదల కావాల్సి ఉంది. కానీ ఓ వారం రోజులు ఆలస్యంగా అంటే అక్టోబర్ 9న వస్తామని పోస్టర్‌ వేసి మరీ చెప్పారు. ఈలోగా హుషారుగా సాగే నారాయణమ్మ పాట వింటూ కాలక్షేపం చేయమన్నారు. 

ఈ సినిమాలో వెంకటేష్‌ భార్యగా శ్రీనిధి శెట్టి, వారి కుమార్తె సంపూర్ణగా యువినా పార్ధవి, పోలీస్ ఆఫీసరుగా నారా రోహిత్ నటిస్తున్నారు. రావు రమేష్,  బ్రహ్మాజీ, పూజిత పొన్నాడ, నికితిన్ ధీర్, ఉదయ్‌బీర్ సంధు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్; సంగీతం: తమన్, కెమెరా: రవి కే చంద్రన్; యాక్షన్: కేవిఎన్ కుమార్‌; ఆర్ట్: ఏఎస్. ప్రకాష్; ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్ చేస్తున్నారు. 

క్రైమ్-ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47ని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష