దోబ్బుచులేటరా... ట్రైలర్‌

September 22, 2026


img

రామ్ కిరణ్ రెడ్డి.బి దర్శకత్వంలో వస్తున్న సినిమా దోబ్బుచులేటరా. ఈ సినిమాలో సూర్య భరత్ చంద్ర, చాందినీ రావు, వివా రాఘవ, శ్రీ అన్వేష్, టీఎన్‌ఆర్ తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. ఓ ఊర్లో మంచి ఫోటో గ్రాఫర్ అవ్వాలని హీరోయిన్‌, అదే ఊర్లో ఫోటో స్టూడియోతో జీవనం సాగిస్తున్న హీరో, మరింత పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని హైదరాబాద్‌ వెళ్ళడం.. ఇద్దరూ ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్ళ నేపధ్యంలో ఏర్పడిన కామెడీ, ప్రేమ, భావోద్వేగాలే ఈ సినిమా కథ అని ట్రైలర్‌లో చెప్పేశారు. 

ఈ సినిమాలో రాజశేఖర్ అనింగి (శుభోదయం శ్రీనివాస్), రాఖీ, హర్షిత, శ్రీవల్లి విజయ, రాహుల్ నడింపల్లి, లక్ష్మీ కమల బామ్మ, నూసి ఆధర్య రెడ్డి, మహేశ్ చిన్న, ఛాయా భాస్కర్ పోచిరాజు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

ఈ సినిమాకు రచన, దర్శకత్వం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, సంభాషణలు: రామ్ కిరణ్ రెడ్డి.బి చేశారు. అంటే వన్ మ్యాన్ షో అనుకోవచ్చు. కానీ సంగీతం ఈశ్వర్ దాతు అందించారు.  

 గ్రాండ్ డ్రీమ్స్ ప్రొడక్షన్, ఫస్ట్ లుక్ ఫిల్మ్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రశాంతి గుమ్మి, ఓబుల్ రెడ్డి.ఎన్ నిర్మాతలు. 

ఈ సినిమా ఈ నెల 25న ఆహా ఓటీటీలో నేరుగా విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష