ఇటీవల ‘రావు బహద్దూర్’గా వచ్చిన నటుడు సత్యదేవ్ ఈసారి మనిషి రక్తం రుచి మరిగిన ఓ అడవిలో పులిని మట్టుబెట్టేందుకు ‘సమవర్తి’గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇటువంటి కథలతో ఇదివరకు చాలా సినిమాలే వచ్చాయి. కనుక సమవర్తితో సత్యదేవ్ మెప్పించగాలరో టీజర్ చూసి అంచనా వేసుకోవాల్సిందే.
అజయ్ నాగ్ వి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సత్యదేవ్, దిలీష్ పోతన్, రాజీవ్ కనకాల, గణవి లక్ష్మణ్, రవీంద్ర విజయ్, మోహన్ భగత్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కథ, దర్శకత్వం: అజయ్ నాగ్ వి; సంగీతం: సింజిత్ ఎర్రమిల్లి; సినిమాటోగ్రఫీ: హర్ష మల్లికార్జున, దేవ్‌దీప్ కుందు; ఆర్ట్ డైరెక్షన్: మొండ్రు రవికుమార్; ఎడిటింగ్: ఆదిత్య తివారీచేస్తున్నారు.
పంచభూత ప్రొడక్షన్స్, రుద్రా పిక్చర్స్ బ్యానర్లపై శివ చరణ్ రెడ్డి జక్కిడి, పద్మతి శశిధర్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.