మాయ లేడీ టీజర్‌ కూడా వెరైటీగా ఉందే!

September 19, 2026


img

రాకేష్‌ వర్రే, మధుమిత సర్కార్‌ జంటగా నటిస్తున్న ‘మాయ లేడీ’ టీజర్‌ రిలీజ్‌ ప్రకటన వెరైటీగా ఉందనుకుంటే టీజర్‌ అంతకంటే వెరైటీగా ఉంది. తాను పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి గుర్తించి ఖచ్చితమైన అభిప్రాయాలు కలిగిన హీరో,  అందుకు పూర్తిభిన్నమైన లక్షణాలున్న అమ్మాయితో ప్రేమలో పడితే...ఎలా ఉంటుందో టీజర్‌లో చూపారు. కనుక సినిమాలో మంచి రోమాన్స్, కామెడీలకు టీజర్‌ పూర్తి  గ్యారెంటీ ఇస్తోంది. 

మరో విశేషమేమిటంటే ఈ సినిమా నిర్మాత రాకేష్‌ వర్రే ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో సత్య, ఇంద్రజ, మైసూర్‌ సురేష్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

‘మాయ లేడీ’ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: ప్రసాంకర్‌, పాటల రచయిత: కృష్ణన్‌ కాంత్‌, సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌, సినిమాటోగ్రఫీ: యెధు రాధాకృష్ణన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: భార్గవ నౌండ్ల, ఎడిటింగ్‌: రవితేజ గిరిజాల చేస్తున్నారు. 

వీ.డీ. జగన్మోహన్‌ రావు సమర్పణలో క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రాకేష్‌ వర్రే స్వయంగా నిర్మించి నటిస్తున్న మాయలేడిని అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష