జాంబీరెడ్డి 2లో ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌...

September 18, 2026


img

ప్రశాంత్ వర్మ-తేజ సజ్జా కాంబినేషన్‌లో వచ్చిన ‘జాంబీరెడ్డి’కి సీక్వెల్‌గా ‘జాంబీరెడ్డి-2’ వస్తోంది. సుపర్న్ ఎస్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జాంబీరెడ్డి-2’ని ప్రశాంత్ వర్మ క్రియేటర్‌గా పర్యవేక్షిస్తున్నారు. 

ఈ సినిమాలో కన్నడ నటుడు ఉపేంద్ర ఓ ముఖ్యపాత్ర చేస్తున్నారు. ఈరోజు ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ‘జాంబీరెడ్డి-2’ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల చేశారు. ఆయుధం పట్టుకొని ఓ చెట్టు కొమ్మపై తలక్రిందులుగా వ్రేలాడుతున్న పోస్టర్‌ అద్భుతంగా ఉంది.     

కొన్ని వారాల క్రితం విడుదల చేసిన టైటిల్‌ గ్లిమ్స్‌లో చార్మినార్ వద్ద జాంబీలను హీరో ఎదుర్కొంటున్నట్లు చూపారు. కనుక ఈసారి జాంబీలు హైదరాబాద్‌లో ప్రవేశించినట్లు చూపబోతున్నట్లు హింట్ ఇచ్చారు. ఈ సినిమాలో షనాయా కపూర్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. 

ఈ సినిమాకు కథ: హుస్సేన్ దలాల్, అబ్బాస్ దలాల్, ప్రశాంత్ వర్మ, సుపర్న్ ఎస్. వర్మ, డైలాగ్స్: సుబ్బు కే, సంగీతం: గౌర హరి, సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజం, ఎడిటింగ్: విజయ్ వెలుకుట్టి చేస్తున్నారు. 

జాంబీ రెడ్డి-2 సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ కలిసి నిర్మిస్తున్న ‘జాంబీరెడ్డి-2’  ‘డెడ్ అర్‌ అలైవ్’ 2027లో విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష