లీస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్... ట్రైలర్‌

September 16, 2026


img

హర్ష చెముడు, హైపర్‌ ఆది ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’. ఈ సిరీస్‌ టీజర్‌ విడుదలయ్యింది. ఈ వెబ్‌ సిరీస్‌లో జీవన్‌ కుమార్‌, ఐశ్వర్య హోలక్కల్‌, రూప శ్రావ్య, శ్రీ విద్య, ప్రేమ్‌ సాగర్‌, వాసు ఇంటూరి, మహేందర్‌, జబర్దస్త్‌ గోపీ తదితరులు నటిస్తున్నారు. టీజర్‌ ఆద్యంతం మంచి వినోదభరితంగా సాగింది. వెబ్‌ సిరీస్‌ మొత్తం కూడా ఇదే స్థాయిలో తీసి మెప్పించగలిగితే ఇది ఇటువంటి మరిన్ని ప్రయోగాలకు స్పూర్తిగా నిలుస్తుంది. 

‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ సెప్టెంబర్‌ 30 నుంచి ఈటీవీ విన్‌లో ప్రసారం కాబోతోంది. బాబు డేగల కథ, దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌కు సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: అజయ్‌ అర్సాడ,  సినిమాటోగ్రఫీ: శక్తి అరవింద్‌, ఎడిటింగ్‌: లిఖిత్‌ లీ చేశారు. 

ఈటీవీ విన్ కోసం చావన్‌, శ్రీధర్‌ చేని, దీపక్‌ ముస్త్యాల కలిసి ఈ వెబ్‌ సిరీస్‌ నిర్మించారు. 


Related Post

సినిమా స‌మీక్ష