విమల్ కృష్ణ దర్శకత్వంలో రాగ్ మయూర్ హీరోగా చేస్తున్న ‘అనుమాన పక్షి’ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాకు ఇలాంటి అచ్చమైన తెలుగు పేరు పెట్టడం బాగానే ఉంది. కానీ పేరుతోనే సినిమాలో కథ లేదని కేవలం హీరో అనుమానించే గుణం అనే చిన్న పాయింట్ పట్టుకొని సినిమా తీసినట్లు అనిపిస్తుంది.
ఇలా ఓ పాయింట్ బేస్ సినిమాలు చాలానే వచ్చాయి. ఇలాంటి వాటికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్, కామెడీ వంటివి బలంగా ఉంటేనే ప్రేక్షకులు సినిమాని ఆదరిస్తారు. ట్రైలర్ చూస్తే ఇవన్నీ పుష్కలంగా ఉన్నట్లే కనిపిస్తోంది. కనుక ప్రేక్షకులు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా సినిమా చూసేలా తీశారనే ఆశిద్దాం.
ఈ సినిమాలో మేరిన్ ఫిలిప్, ప్రిన్స్ సెసిల్, అనన్య, చరిత్, బ్రహ్మాజీ, రాశి, అజయ్, మస్త్ అలీ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: విమల్ కృష్ణ, కెమెరా:సునీల్ కుమార్ నామా, ఆర్ట్: జేకే మూర్తి, ఎడిటింగ్: చోట కే ప్రసాద్, కోరియోగ్రఫీ: ఈశ్వర్ చేశారు.
చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవి చిలక, మెగా చిలక నిర్మించిన అనుమాన పక్షి సెప్టెంబర్ 18న విడుదల కాబోతోంది.