జీవీ ప్రకాశ్ కుమార్, కయదు లోహర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇమ్మోర్టల్’ (సబ్ టైటిల్ నాకు మరణం లేదు) మారియప్పన్ చిన్నా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలయింది. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సినిమాపై అంచనాలు పెంచుతోంది.
ఈ సినిమాలో టీఎం కార్తీక్, కుమార్ నటరాజన్, లోల్లు సభ మారన్, ఆదిత్య కతిర్, అర్షు మహారాజన్, పెమా త్సాంచో, సునీతా శ్రేష్ఠ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.
ఇమ్మోర్టల్‌కు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారియప్పన్ చిన్నా, సినిమాటోగ్రఫీ: అరుణ్ రాధాకృష్ణన్, సంగీతం: సామ్ సీఎస్, కొరియోగ్రఫీ: ఎం. షరీఫ్, సబరీష్, ఆర్ట్ డైరెక్టర్: శివ శంకర్. స్టంట్స్: ఆర్.శక్తి శరవణన్, జి.ఎన్.మురుగన్, ఎడిటింగ్: రాజేశ్ ఎం, వీఎఫ్‌ఎక్స్: టీవో డబ్ల్యూ వీఎఫ్‌ఎక్స్ (ది ఆర్డినరీ వర్క్స్).
ఏకే ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై అరుణ్‌కుమార్ ధనశేఖరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.