అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ భాస్కర్, వికె నరేష్, అఖిల్ ఉద్దెమారి ప్రధానపాత్రలు చేస్తున్న ‘క్రేజీ కల్యాణం’ సినిమా నుంచి ‘కాక ధూమ్ ధమాకా’ సాంగ్ ప్రమో ఇటీవల విడుదలైంది. ఇప్పుడు పూర్తి పాట విడుదలైంది. కాసర్ల శ్యాం వ్రాసిన ఈ ‘కాక ధూమ్ ధమాకా’ పాటకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా, జంగి రెడ్డి హుషారుగా పాడారు. పెళ్ళి వేడుకలో హుషారుగా సాగే ఈ పాటకు అనుపమ పరమేశ్వరన్ మిగిలినవారితో కలిసి చేసిన డాన్స్ అద్భుతంగా ఉంది.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: బద్రప్ప గజుల, సాహిత్యం: గోరటి వెంకన్న, కాసర్ల శ్యామ్, దినేష్ కక్కెర్ల, సంగీతం: సురేష్ బొబ్బిలి, సినిమాటోగ్రఫీ: శ్యామ్ దుపాటి, కొరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి, ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని, యాక్షన్: డ్రాగన్ ప్రకాశ్ చేస్తున్నారు.
యారో సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నం.2గా బూసం జగన్మోహన్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు.