త్రివిక్రమ్ శ్రీనివాస్- విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నం: 47’ టీజర్ కొద్ది సేపటి క్రితం విడుదలైంది. టీజర్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ పంచ్ డైలాగులు, వెంకటేష్ మార్క్ కామెడీ, యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి.
“నాకు ఫ్యామిలీ ఇమేజ్ ఉందని నాకు తెలుసు. ఐ నో. కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే యాక్షన్ కూడా చేయడానికి వెనకాడను,” అంటూ వెంకటేష్ సీరియస్‌గా చెప్పిన డైలాగ్ విన్నప్పుడు ఎవరూ ఆవేశాపడరు హాయిగా నవ్వుకుంటారు. ఎందుకంటే అదే వాస్తవం కనుక.
ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా శ్రీనిధి శెట్టి, వారి కుమార్తె సంపూర్ణగా యువినా పార్ధవి, పోలీస్ ఆఫీసరుగా నారా రోహిత్ నటిస్తున్నారు. రావు రమేష్, బ్రహ్మాజీ, పూజిత పొన్నాడ, నికితిన్ ధీర్, ఉదయ్‌బీర్ సంధు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్; సంగీతం: తమన్, కెమెరా: రవి కే చంద్రన్; యాక్షన్: కేవిఎన్ కుమార్; ఆర్ట్: ఏఎస్. ప్రకాష్; ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్ చేస్తున్నారు.
క్రైమ్-ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47ని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కాబోతోంది.