డిసెంబర్‌లో వృషకర్మ విడుదల

September 11, 2026


img

కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా చేస్తున్న ‘వృషకర్మ’ ఈ ఏడాది డిసెంబర్‌ 4వ తేదీన విడుదల కాబోతోంది. రిలీజ్‌ డేట్ ప్రకటిస్తూ నాగ చైతన్య పోస్టర్‌ వేశారు. 

అతీంద్రియ శక్తులు మేల్కొన్నప్పుడు, సృష్టి ధర్మం తప్పినప్పుడు విధి ఒక వృషకర్మని ఎంచుకుంటుందని ఫస్ట్ గ్లిమ్స్‌లోనే ఈ సినిమా కథ ఏమిటో చెప్పారు. ఈ సినిమాలో మానవాళికి ప్రమాదకరమైన దుష్ట శక్తులను మట్టుబెట్టే సాహస వీరుడుగా నాగ చైతన్య నటిస్తున్నారు.   

ఈ సినిమాలో నాగ చైతన్యకు జంటగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు స్పర్ష్ శ్రీవాత్సవ్ (‘లాఫతా లేడీస్) ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కార్తీక్‌ దండు, స్క్రీన్ ప్లే: సుకుమార్, సంగీతం: అజనీష్ బి లోక్‌నాధ్, కెమెరా: నైల్ డి కునహా, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 

బాపినీడు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో సుకుమార్ రైటింగ్స్ కూడా భాగస్వామిగా ఉండటంతో భారీ అంచనాలున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌ 4వ తేదీన వృషకర్మ విడుదల కాబోతోంది.   


Related Post

సినిమా స‌మీక్ష