దృశ్యం-3 హిందీ వెర్షన్ ట్రైలర్‌ చూశారా?

September 09, 2026


img

మలయాళ దర్శకుడు జీతూ జోసఫ్ దర్శకత్వంలో వచ్చిన దృశ్యం-1,2 సూపర్ హిట్ అవడంతో వాటికి కొనసాగింపుగా దృశ్యం-3 వచ్చింది. కానీ మొదటి రెండు భాగాలు ఆకట్టుకున్నంతగా అది ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా మూడో భాగాన్ని కూడా హిందీలో రీమేక్ చేశారు.     

అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో రూపొందించిన దృశ్యం-3లో అజయ్ దేవగణ్, టబు, శ్రియా శరణ్, జైదీప్ అహ్లావత్, ప్రకాశ్ రాజ్, రజత్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దీని ట్రైలర్‌ నేడు విడుదల చేశారు. ఈ మూడో భాగంతో ఈ సిరీస్ ముగిస్తున్న సూచనగా దృశ్యం-3, ది కన్‌క్లూజన్ అని పేర్కొన్నారు.   

ఈ సినిమాకు కథ: అభిషేక్ పాఠక్, స్క్రీన్‌ప్లే: ఆమిల్ కీయాన్ ఖాన్, అభిషేక్ పాఠక్, పర్వీజ్ షేక్, సంభాషణలు: ఆమిల్ కీయాన్ ఖాన్, పాటలు: మనోజ్ ముంతశిర్, ఆమిల్ కీయాన్ ఖాన్, కర్మ, సంగీతం: రవి బస్రూర్, రోచక్ కోహ్లీ, కర్మ సినిమాటోగ్రఫీ: సుధీర్ కుమార్ చౌదరి, యాక్షన్: ఆర్.పీ. యాదవ్, ఎడిటింగ్: సందీప్ ఫ్రాన్సిస్ చేశారు. 

స్టార్ స్టూడియో18 సమర్పణలో పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష