కాకాలో చిరంజీవి కూతురుగా అమ్ములు? ఫస్ట్ లుక్..

September 08, 2026


img

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమా నించి ఓ అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్ర చేస్తున్న మలయాళ నటి అనస్వర రాజన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 

ఈ సినిమాలో అనస్వర రాజన్ ‘అమ్ములు’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఫస్ట్ లుక్‌లో ఆమె వైద్య విద్యార్ధినిగా పరిచయం చేశారు. చేతిలో పుస్తకాలు పట్టుకుని హోమ్లీ లుక్‌లో కనిపిస్తున్న అమ్ములు ‘హార్ట్ ఆఫ్ కాకా’గా పేర్కొన్నారు. 

అమ్ములు నీడగా చిరంజీవిని చూపడంతో బహుశః ఇది తండ్రీ కూతుర్ల సెంటిమెంట్ అయ్యుండవచ్చనిపిస్తుంది. కనుక చిరంజీవి మార్క్ కామెడీ, యాక్షన్‌తో పాటు భావోద్వేగాలు కూడా సినిమాలో ఉంటాయి. 

ఈ సినిమాలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కే. చక్రవర్తి రెడ్డి, సంగీతం: తమన్, సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటింగ్: ఆంటోనీ రూబెన్ చేస్తున్నారు. డైలాగ్స్: భాను-నందు, యాక్షన్ కొరియోగ్రఫీ: రామ్-లక్ష్మణ్, నబాకాంత్,  ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా, వీఎఫ్‌ఎక్స్‌: యుగంధర్ చేస్తున్నారు. 

కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే. నారాయణ నిర్మిస్తున్న ‘కాక’ 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష