నెట్‌ఫ్లిక్స్‌లోకి విశ్వనాథ్ అండ్ సన్స్.. ఎప్పుడంటే..

September 08, 2026


img

వెంకీ అట్లూరి దర్శకత్వంలో ప్రముఖ కోలీవుడ్‌ నటుడు సూర్య, మమితా బైజు జంటగా చేసిన విశ్వనాథ్ అండ్ సన్స్ ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడీ సినిమా ఈ నెల 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోకి వచ్చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ స్వయంగా ఈ విషయం ప్రకటించింది. 

క్లుప్తంగా కథ సంపన్న కుటుంబానికి చెందిన 40 ఏళ్ళు వయసున్న సంజయ్ విశ్వనాథ్ (సూర్య), పెళ్ళి చేసుకోకుండా సరోగసీ పద్దతిలో ఓ పిల్లాడికి తండ్రి అవుతాడు. కానీ ఊహించని విధంగా ఆ బాబుకు జబ్బు పడతాడు. అతని చికిత్స కోసం తప్పనిసరిగా కన్నతల్లి అవసరం కనుక మళ్ళీ అమెరికా వెళ్తాడు. అక్కడ మ్యాడీ మధన కామేశ్వరి (మమతా బైజు) పరిచయం అవుతుంది. విశ్వనాథ్ వయసులో తన కంటే చాలా పెద్దవాడైనప్పటికీ అతనితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ సినిమా కథ.  


Related Post

సినిమా స‌మీక్ష