ప్రముఖ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ తేజస్ హీరోగా కొత్త సినిమాకు నేడు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై చిత్రానికి క్లాప్ కొట్టారు. ఈ సినిమాలో ఆయుష్ తేజస్‌కు జోడీగా నానిషా నటిస్తున్నారు.
ఈ సినిమాతోనే కట్టా జయ్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. అతను చెప్పిన కథ నచ్చి పూర్తి నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నానని ఆయుష్ తేజస్ తెలిపారు.
ఆయుష్ తేజస్‌కు ఇది రెండవ సినిమా. ఇదివరకు తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంతో ‘దక్ష’ అనే హారర్ థ్రిల్లర్‌లో నటించగా, అది 2023లో థియేటర్లలో, ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది.
నేడు మొదలుపెట్టిన సినిమాలో ఇతర నటీనటులు,సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని కట్టా జయ్ తెలిపారు.