మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

September 06, 2026
img

ప్రముఖ తెలంగాణ ఫోక్ సాంగ్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యయత్నం చేశారు. కానీ కుటుంబ సభ్యులు సకాలంలో గుర్తించి అడ్డుపడి ఆమె ప్రాణం కాపాడారు. సాటి ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి లోబరుచుకొని మోసం చేశాడంటూ ఆమె కొన్ని రోజుల క్రితం నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు ఈశ్వర్ సాయిపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా అతనిని ఈ కేసు నుంచి తప్పించి కాపాడే ప్రయత్నం చేస్తునందుకు బాధతో ఆత్మహత్యాయత్నం చేశానని మాధురి రాథోడ్ చెప్పారు. ఆమె తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోబోతే కుటుంబ సభ్యులు కాపాడారు. 

ఈశ్వర్ సాయి,  మాధురి రాథోడ్ కలిసి అనేక తెలంగాణ ఫోక్ సాంగ్స్ చేశారు. వాటితో ఇద్దరూ చాలా పాపులర్ అయ్యారు. వారి స్నేహం శారీరిక సంబంధానికి దారి తీసింది. వారిద్దరూ వేములవాడలో ఓ హోటల్ గదిలో ఉన్నప్పుడు ఈశ్వర సాయి భార్య శరణ్య వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని మాధురి రాథోడ్‌ని చితకబాదారు. కానీ ఆ తర్వాత    మాధురి రాథోడ్ పోలీస్ స్టేషన్‌లో ఈశ్వర్ సాయి మోసం చేశాడంటూ పిర్యాదు చేయడం ఊహించని ట్విస్ట్ అనే చెప్పాలి.

అరెస్టు భయంతో అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి, ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టుని ఆశ్రయించాడు. కనుక పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. ఈలోగా మాధూరీ రాథోడ్ ఆత్మహత్యాయత్నం చేసింది. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/47NqTUWJMu8?si=BxSgpxFawry6fLbT" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post