సంతోష్ జగర్లపూడి దర్శకత్వంలో సుమంత్, ఐశ్వర్య రాజేశ్, సిద్ధు జొన్నలగడ్డ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. వారణాసి గ్రామదేవత వారాహి అమ్మవారి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్ వారాహి అమ్మవారి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచగా.. తాజాగా మరో అప్‌డేట్ వచ్చింది.
ఈ సినిమా నుంచి ‘ది రేజ్ ఆఫ్ వారాహి’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. హీరో నాగచైతన్య ఈ పాటను రిలీజ్ చేశారు. కడలి సత్యనారాయణ వ్రాసిన ఈ పాటకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా.. నకాశ్ అజీజ్ పాడారు.
ఈ సినిమాలో సుమంత్, ఐశ్వర్య రాజేశ్‌తో పాటు మాళవిక నాయర్, మీనాక్షి గోస్వామి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, అలీ, రాజీవ్ కనకాల తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
రాజశ్యామల ఎంటర్‌టైన్మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై మధుకాలిపు, లక్ష్మణ్ కలిసి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 11న థియేటర్లలోకి రానుంది.