మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి: జోజో

October 23, 2026


img

కృష్ణకమల్, మాహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త చిత్రం ‘జో జో’. సీమలోని జొన్నగిరి భూముల్లో వజ్రాల వేట నేపథ్యంలో సాగే గ్రామీణ సినిమా ఇది. దీని ప్రమోషన్స్‌ చాలా అనూహ్యంగా ఉన్నాయి. “రెండో హెచ్చరిక. మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి,” అంటూ విడుదల చేసిన వీడియోలో హీరోయిన్ డైలాగులు వింటే అందరూ షాక్ అవుతారు. కానీ ఓ బాధ్యత గల మగాడు ఏవిధంగా ఉండాలో గ్రామీణ భాషలో చెప్పడం వలన కాస్త నాటుగా, మోటుగా అనిపిస్తుంది. కానీ కిరణ్ జయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘జోజో’ సినిమాలో ఏదో గట్టి విషయమే ఉందని ఈ ప్రమోషన్స్‌ చెపుతున్నాయి. 

ఈ సినిమాలో మకరంద్ దేశ్‌పాండే, ఫణీంద్ర దేవరపల్లి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: కిరణ్ జయ్ కుమార్‌, సంగీతం: మహేశ్ శంకర్, సినిమాటోగ్రఫీ: రోహిత్ కుమార్‌, ఎడిటింగ్: మాధవ్ కుమార్ గుళ్లపల్లి చేస్తున్నారు.

దేవ కట్టా సమర్పణలో వీకేఎల్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోందని జోజో సెకండ్ వార్నింగులో చెప్పారు. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/KdalKPXRYfg?si=YA1cAgeJVtgMiJfa" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష