బిగ్‌బాస్‌ హౌస్‌లోకి షాలిని రీ-ఎంట్రీ... మళ్ళీ రచ్చ రచ్చ

October 22, 2026


img

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10లో ప్రతీరోజూ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంతూనే ఉన్నాయి. మొన్న 45వ రోజు ఎపిసోడ్‌లో సీక్రెట్‌ రూమ్‌లోకి పంపించబడిన షాలిని తిరిగి హౌస్‌లోకి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆమె రీఎంట్రీతో హౌస్‌లో మళ్ళీ కంటెస్టెంట్ల మధ్య రచ్చరచ్చ జరిగింది. 

షాలిని తిరిగి రావడంతో రోహిత్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ఆమెను చూసి హాగ్ చేసుకొని సంతోషం వ్యక్తం చేశాడు. అయితే, ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లను మళ్లీ హౌస్‌లోకి తీసుకు రావడంపై రామ్‌ ప్రసాద్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలిమినేట్ అయినవారు ఇలా తిరిగి వస్తుంటే గేమ్‌ తీరే మారిపోతుందని వాదించారు. 

ఇదిలా ఉండగా, బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు ‘డెస్టినీ బాక్స్‌’ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో రెడ్‌, ఎల్లో, గ్రీన్‌ బోర్డుల ద్వారా కంటెస్టెంట్ల స్థాయిని నిర్ణయించే విధంగా గేమ్‌ సాగింది.

 రెడ్‌ జోన్‌ నుంచి ఎల్లో, ఆ తర్వాత గ్రీన్‌ జోన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో రామ్‌ ప్రసాద్‌, ఝాన్సీ పోటీపడగా, రామ్‌ ప్రసాద్‌ తన రౌండ్‌లో విజయం సాధించి ఎల్లో స్థాయికి చేరుకున్నాడు.

టాస్క్‌ సమయంలో షాలిని, దక్షి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తన సలహా మేరకు వ్యక్తిగతంగా ఆట ఆడలేదంటూ దక్షిని షాలిని ప్రశ్నించింది. 

మరోవైపు రోహిత్‌ ఆట తీరుపైనా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో రాబోయే టాస్క్‌లలో కంటెస్టెంట్లు ఎలా ఆడతారన్నది ఆసక్తికరంగా మారింది.


Related Post

సినిమా స‌మీక్ష