తెలుగు సినిమాలకు ఇంగ్లీష్, హిందీ టైటిల్స్, తమిళ టైటిల్స్-తెలుగులో డబ్బింగ్ సినిమాలు, అచ్చ తెలుగు టైటిల్స్, తెలుగు రాష్ట్రాలలో ప్రాంతాల పేర్లతో టైటిల్స్ ఇలా రకరకాలు కనిపిస్తుంటాయి. కానీ మొట్టమొదటిసారిగా ఓ తెలుగు సినిమాకి అచ్చమైన తెలుగులో అతిపెద్ద పేరుతో వస్తోంది. సినిమా పేరు.. “ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుంచి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు.”
ఈ సినిమా టైటిల్ చదవడానికే ఇంత సమయం పడుతుంటే.. దీని గురించి ఇలా వివరించే జర్నలిస్టులు, ఈ సినిమా చూడాలనుకునే ప్రేక్షకుల పరిస్థితి ఎలా ఉంటుందో మరి! కనుక సినిమా ఎలా ఉంటుందో ఏమో గానీ, ఈ అతిపెద్ద టైటిల్ కారణంగానే తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటికీ నిలిచిపోతుంది.
సూపర్ హిట్ సినిమా ‘ఆ నలుగురు’ దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వంలో హర్ష హీరోగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవి వర్మ, అశోక్ వర్ధన్, రేఖా
నిరోషా తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
“ఎ ఫర్ బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్ బిడెన్ సాగా” అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాలో బ్రెయిన్ మ్యాపింగ్, సౌండ్ థెరపీ,మెమొరీస్ వంటి భావోద్వేగాలతో సంగీత ప్రాధాన్యంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.