యంగ్ హీరో రాజ్ తరుణ్, అమృత చౌదరి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘టార్టాయిస్’. రిత్విక్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సస్పెన్స్, యాక్షన్, థ్రిల్లర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే ఈ సినిమాపై అంచనాలను పెంచింది.
తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ‘నీ పరిచయం.. నీ పరిచయం’ అంటూ సాగే మెలోడీ సాంగ్‌ని త్వరలో విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ పాటకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా, ఆస్కార్ అవార్డు విజేత చంద్రబోస్ సాహిత్యం అందించారు. ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఈ పాటను ఆలపించారు.
ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌తో పాటు రాజ్ తరుణ్, అమృత చౌదరి వర్షంలో తడుస్తున్న రొమాంటిక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.
‘టార్టాయిస్’లో రాజ్ తరుణ్ స్లీప్ వాకింగ్ చేస్తూ హత్యలు చేసే హంతకుడుగా, పగలు సాధారణ వ్యక్తిగా విభిన్నమైన పాత్ర చేస్తున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్‌తో చూచాయగా చెప్పారు.
ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.