జీవీ ప్రకాశ్ కుమార్, కయదు లోహర్ జంటగా నటించిన ‘ఇమ్మోర్టల్’ (సబ్ టైటిల్: నాకు మరణం లేదు) థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడీ సినిమా ఈ నెల 30 నుంచి సోనీలివ్ ఓటీటీలోకి ప్రసారం కాబోతోంది.
మారియప్పన్ చిన్నా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో టీఎం కార్తీక్, కుమార్ నటరాజన్, లోల్లు సభ మారన్, ఆదిత్య కతిర్, అర్షు మహారాజన్, పెమా త్సాంచో, సునీతా శ్రేష్ఠ ముఖ్య పాత్రలు చేశారు.
ఇమ్మోర్టల్‌కు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారియప్పన్ చిన్నా, సినిమాటోగ్రఫీ: అరుణ్ రాధాకృష్ణన్, సంగీతం: సామ్ సీఎస్, కొరియోగ్రఫీ: ఎం. షరీఫ్, సబరీష్, ఆర్ట్ డైరెక్టర్: శివ శంకర్. స్టంట్స్: ఆర్.శక్తి శరవణన్, జి.ఎన్.మురుగన్, ఎడిటింగ్: రాజేశ్ ఎం, వీఎఫ్‌ఎక్స్: టీవో డబ్ల్యూ వీఎఫ్‌ఎక్స్ (ది ఆర్డినరీ వర్క్స్) చేశారు.
హీరోయిన్ (కయదు లోహర్)తో ఓ అద్దె గదిని షేర్ చేసుకున్న హీరో (జీవీ ప్రకాశ్ కుమార్) ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ తర్వాత ఆమె తాత ద్వారా ఆమె పూర్వజన్మ గురించి తెలుసుకొని భయపడి వేరే ఫ్లాట్‌కి మారిపోదామనుకుంటాడు. కానీ తిరిగి ఆమె వద్దకే చేరుకుంటూ ఉంటాడు. అసలు ఆమెకు పూర్వజన్మతో ఏం సంబంధం? ఆ తర్వాత ఏమి జరిగింది? అనేది ఓటీటీలో చూసి తెలుసుకుంటే బాగుంటుంది.