హైదరాబాద్‌లో స్టీల్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ సందర్భంగా జరిగిన సభలో మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి అన్న మాటలు వైరల్ అయ్యాయి.
“గతంలో కేసీఆర్ సిఎంగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా ఉన్నారని, కాస్త కట్టడి చేయాలని చెప్పాను. లేకుంటే మీరు ఇంటికి వెళ్ళిపోతారని చెప్పాను. కానీ కేసీఆర్ రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేసి నా మాట పట్టించుకోలేదు.
ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా నేను ఓ మాట చెప్తున్నా. మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారో తెలీదు కానీ మీరు సిఎం పదవి చేపట్టిన మీలో ఆ దూకుడు తగ్గింది. మళ్ళీ మునుపటి రేవంత్ రెడ్డిని నేను చూడాలి. మీరు ప్రజలలోకి వెళ్ళండి... వారి ఆదరణ పొందండి,” అని ఓవైసీ హితవు పలికారు.
తర్వాత ప్రసంగించిన రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, “ముఖ్యమంత్రి కుర్చీకి కొన్ని పరిమితులు ఉంటాయి. కనుక వాటికి కట్టుబడి ఉండాలి. నేను స్నేహానికి లొంగుతాను కానీ బెదిరింపులకు లొంగను. స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్తాను,” అని అన్నారు.
రేవంత్ దూకుడు గురించి KCRకు చెప్పా: ఒవైసీ
TG: సైదాబాద్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము కాంగ్రెస్ పార్టీకి కాకుండా సీఎం రేవంత్‌రెడ్డికే మద్దతిస్తున్నామని స్పష్టం చేశారు. ‘‘మేం గతంలో BRSకు సపోర్టు చేశాం. రేవంత్ దూకుడును… pic.twitter.com/HsMINncb1L