తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని నటుడు బ్రహ్మాజీ. ఆయన రకరకాల పాత్రలు చేసి మెప్పిస్తుంటారు. తొలిసారిగా ఆయన ప్రధాన పాత్రలో ఓ పౌరాణిక సినిమాలో చేస్తున్నారు. భక్తి, ఆధ్యాత్మిక అంశాలతో తెరకెక్కుతున్న ‘కృష్ణంభజే’ సినిమాలో అయన శ్రీకృష్ణుడి భక్తుడు మార్కండేయగా నటిస్తున్నారు. నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మార్కేండేయగా ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
నాగరాజు కొట్టే దర్శకత్వంలో జయశ్రీ మీడియా సమర్పణలో కలాల్ శ్రీనివాస్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘కృష్ణం భజే’ వంటి మంచి సినిమాలో మార్కేండేయ వంటి ప్రత్యేకమైన పాత్ర లభించడం తన పూర్వ జన్మ సుకృతమని బ్రహ్మాజీ అన్నారు. దర్శకుడు నాగరాజు కొట్టే, నిర్మాత కలాల్ శ్రీనివాస్‌తో కలిసి పనిచేయడం తనకు సరికొత్త అనుభవంగా ఉందని బ్రహ్మాజీ అన్నారు. ఈ సినిమా సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి.