ఎపిక్ ట్రైలర్‌.. ఒకటి చెప్పారు..మరోటి థియేటర్లలోనట!

September 05, 2026


img

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. సినీ దర్శకుడు అవ్వాలనుకున్న హీరో ఇంట్లో నాన్నతో తిట్లు తింటూ, విదేశీ ఏజంట్ చేతిలో మోసపోయి లండన్‌ చేరుకుంటాడు.

అక్కడ హీరోయిన్‌తో పరిచయం, ప్రేమ, శారీరక సంబంధం వరకు వెళుతుంది. తర్వాత ఏం జరిగిందనేదే ఈ సినిమా కథ అని ట్రైలర్‌లో చెప్పారు. ప్రేమ, యూత్‌ఫుల్ ఎమోషన్స్‌తో ట్రైలర్‌ యువతని ఆకట్టుకునేలా ఉంది.

సూపర్ హిట్ సినిమా ‘బేబీ’ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి చేస్తున్న సినిమా కావడంతో, ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’పై భారీగా అంచనాలున్నాయి. ట్రైలర్‌ వాటిని ఇంకా పెంచింది.  

ఈ సినిమాకు సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్; సినిమాటోగ్రఫీ: అజీమ్ మొహమ్మద్; ఆర్ట్: ధీరజ్ పొనుగోటి, ప్రకీర్తి ఉప్పలపాటి;ఎడిటింగ్: నవీన్ నూలి, చేశారు.

సితారా ఎంటర్‌టైన్మెంట్స్‌, శ్రీకర్ స్టూడియోస్, ఫార్చ్యూన్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 11న విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష