రేణిగుంట 2 టీజర్.. రియలిస్టిక్ యాక్షన్

September 03, 2026


img

తమిళంలో తెరకెక్కిన ‘రేణిగుంట’ సినిమా సూపర్ హిట్ అవడంతో దానికి సీక్వెల్‌గా ‘రేణిగుంట 2’ సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. 

ఆర్. పన్నీర్‌సెల్వం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జానీ, షాలీ నీవేకాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టీజర్‌ను చాలా ఆసక్తికరంగా కట్ చేశారు. ముఖ్యంగా జానీ పాత్రను యాక్షన్ నేపథ్యంలో చూపించిన తీరు సినిమాపై అంచనాలు పెంచుతోంది.

ఈ చిత్రానికి పాటలు: వివేక, సంగీతం: మనూ రవిచంద్రన్, కెమెరా: ఆర్.బి. గురుదేవ్, ఆర్ట్: లాల్‌గుడి ఎన్. ఇళయరాజా, డాన్స్ కొరియోగ్రఫీ: బృందా, అజర్, యాక్షన్ కొరియోగ్రఫీ: కె. రాజశేఖర్, ఎడిటింగ్: ఆంథోనీ చేస్తున్నారు.

ఏ. పన్నీర్‌సెల్వం ఫిల్మ్ ఫ్యాక్టరీ, కింగ్స్ స్టూడియోస్ బ్యానర్లపై కె.దేవకుమార్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. రేణిగుంట-2 రిలీజ్‌ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. 


Related Post

సినిమా స‌మీక్ష